మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి గల మ్యూజిక్ సెషన్స్ ను పూర్తి చేసేయమన్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడన్న విషయం తెల్సిందేనిన్న ఇదే విషయాన్ని థమన్ తన ట్విట్టర్ లో తెలియజేసారు. ఈ రోజు నుండి సర్కారు వారి పాట మ్యూజికల్ జర్నీ మొదలవనుంది. ఈ ప్రయానాన్ని ఒక సాంగ్ రికార్డింగ్ తో స్టార్ట్ చేస్తున్నాం. అద్భుతమైన వాయిద్యబృందం మాతో పని చేస్తుంది. అభిమానులందరూ కోరుకునేలా ఈ అల్బమ్ సూపర్ గా ఉండబోతుంది. నాకు ఈ అవకాశాన్నిచ్చిన మన సూపర్‌స్టార్ మహేష్ కి, దర్శకులు పరశురాం గారికి నా ధన్యవాదాలు అని ట్వీట్ చేసి, అభిమానులకు కిక్ ఇచ్చేలా ఇట్స్ షో టైమ్ అనే కాప్షన్ ను జతపరిచాడు థమన్.