గతంలో నిత్యామీనన్ , అభిషేక్ బచ్చన్ నటించిన ‘బ్రీత్: ఇంటు ది షాడోస్’ హిందీ వెబ్ సిరీస్ తో అదరగొట్టిన విషయం తెలిసిందే... కాగా ఇప్పుడు అదే రూట్ లో మరో మూవీ ఆఫర్ రావడంతో నిత్య మీనన్ చేద్దామని ఆలోచనలోనే ఉన్నారట. ఈ చిత్రానికి దర్శకుడు అవసరాల శ్రీనివాస్ భారీ బడ్జెట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించాలని నిత్యా మీనన్ ని సంప్రదించారట.. థ్రిల్లర్ చిత్రాల గెలుపు రుచి చూసిన నిత్య మీనన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.