తనని స్టార్ హీరోయిన్ని చేసిన తెలుగు ప్రేక్షకులపై ఎంత ప్రేమో తన వివాహంలోనూ కాజల్ చూపించింది. తెలుగు వివాహ సంప్రదాయమైన జీలకర్ర-బెల్లంతో కూడా ఆమె వివాహం జరిగినట్లుగా కాజల్ తెలిపింది.అంతే కాదు.. ఈ జీలకర్ర-బెల్లం విశిష్టతను కూడా కాజల్ తెలుపడం విశేషం. అందుకే పంజాబీ అయిన కాజల్‌ను, కశ్మీరీ అయిన గౌతమ్ కిచ్లూ దంపతులను తెలుగు ప్రేక్షకులు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నామని తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.మరో పోస్ట్‌లో.. ''పెళ్లి అనగానే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అందులోనూ ఈ మహమ్మారి టైమ్‌లో అది ఒక ఛాలెంజ్ లాంటిది. అయినా సరే.. మేము కోవిడ్ ప్రోటోకాల్‌ని ఖచ్చితంగా పాటించాము. అందుకే భారీగా జరగాల్సిన ఈ పెళ్లిని చాలా అంటే అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో ముగించాము. వేడుకలో భాగమైన ప్రతి ఒక్కరికీ ముందుగానే అన్ని జాగ్రత్తలు తెలియజేశాము. మా పెళ్లికి హాజరైన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా ఎందరినో మిస్ అయ్యాము.. వారందరినీ త్వరలోనే కలుసుకుంటానని ఆశిస్తున్నాను.." అని కాజల్ పేర్కొంది.