జెర్సీ సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రద్ధ.. తన నటనతో ప్రేక్షకులను ఆకర్షించింది. శ్రద్దా శ్రీనాథ్ చేయనున్న సినిమాల్లో ఒక బైలింగ్యువల్ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈ చిత్రం తమిళం, తెలుగులో రెండు భాషలలో చిత్రీకరించబోతున్నారు. ప్రమోద్ సుందర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో శ్రద్దా శ్రీనాథ్ ప్రధాన పాత్ర చేయనుంది.