షూటింగ్ స్పాట్లో అడుగుపెట్టడానికి ముందే హనీమూన్‌కి వెళ్ళి రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.హనీమూన్‌కి వెళ్ళడానికి కాజల్ అగర్వాల్, ఆమె భర్త గౌతమ్ కిచ్లూ రెడీ. ''బ్యాగ్స్ ప్యాక్ చేశాం. విమానం ఎక్కేందుకు రెడీగా ఉన్నాం'' అని కాజల్ అగర్వాల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో రెండు ఫొటోలు పోస్ట్ చేశారు.అందులో ఒక ఫొటోలో పాస్‌పోర్టులు ఉన్నాయి. వాటిపై కాజల్ కిచ్లూ, గౌతమ్ కిచ్లూ అని పేర్లు ఉన్నాయి. దీన్ని బట్టి కాజల్ పేరు చివర అగర్వాల్ ఇంటి పేరు పోయి... కిచ్లూ ఇంటి పేరు వచ్చిందన్నమాట.  పెళ్లైన తర్వాత కొందరు స్త్రీలు ఇంటిపేరు మార్చుకోవడానికి ఇష్టపడరు. కానీ, కాజల్ పేరు మార్చుకున్నారు.