పునర్నవి నటనకు మరియు వైఖరికి ఫిదా అయిపోయారు తెలుగు ప్రేక్షకులు... ముద్దు ముద్దు మాటలతో మనల్ని అలరించిన పున్ను ఇప్పుడు వెబ్ సిరీస్ ''కమిట్ మెంటల్'' తో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్ సిరీస్ పై ఎన్నో అంచనాలు ఆశల్ని పెట్టుకుంది పున్ను.తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' కోసం చిత్రీకరించబడిన ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన టీజర్ ని ఇటీవలే విడుదల చేశారు.