ఇటీవలే పవర్ స్టార్ పుట్టిన రోజు సందర్భంగా క్రిష్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ విడుదల చేయగా, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్టుపై ఇంట్రస్టింగ్ అప్డేట్ అందుతోంది. ఇప్పటికే లాక్ చేసిన ఈ స్క్రిప్టు ని మరోసారి రీరైట్ చేస్తున్నారట.  పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఈ స్క్రిప్టు మరోసారి చదివి తనదైన కొన్ని సూచనలు అందచేసారట.దానికి తోడు పవన్ వరస ప్రాజెక్టులతో బిజిగా ఉండటంతో క్రిష్ కు టైమ్ దొరికినట్లైంది. ఈ టైమ్ ని వృధా చేసుకోదలుచుకోలేదు. కథకు ఉన్న లూజ్ ఎండ్స్ పై వర్క్ చేస్తున్నారట. తన రైటర్స్ టీమ్ తో కలిసి రాత్రింబవళ్లు ఈ స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత రానున్న ఈ సినిమాతో ఎలాగైనా ఫామ్ లోకి రావాలని క్రిష్ భావిస్తున్నారు.