కేజీఎఫ్ సినిమాతో ఆల్ ఇండియా స్టార్ డం దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, డార్లింగ్ ప్రభాస్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేసే అవకాశాలు ఉన్నాయంటూ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్ వారు ప్రశాంత్ నీల్ తో చర్చలు జరిపిన మాట వాస్తవమే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు సైతం అంటున్నారు.