రాజమౌళి విసిరిన ఛాలెంజ్ ని తిరస్కరించాడు వర్మ. ప్రస్తుతం ప్రముఖ తారల మధ్య గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నడుస్తున్న విషయం తెలిసిందే. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఇటీవలే చరణ్ మొక్కలు నాటి తన ఆర్ఆర్ఆర్ టీం మెంబర్స్ అయిన జక్కన్న రాజమౌళి.. హీరోయిన్ ఆలియా భట్ ఇంకా అభిమానులను ఛాలెంజ్ చేశారు. చరణ్ ఛాలెంజ్ ను స్వీకరించిన దర్శకుడు రాజమౌళి నేడు తన ఆర్ఆర్ఆర్ టీం అందరితో కలిసి మొక్కలు నాటాడు.