ఆర్ఎక్స్ 100 సినిమాలో ఆమె పాత్రను తలపించేలా మరో అవకాశం ఆమె తలుపు తట్టింది.అదే తరహా పాత్రలో కనిపించనుంది ఈ హాట్ బ్యూటీ. 'అనగనగా ఓ అతిథి' అనే సినిమాతో పాయల్ రాజ్ పుత్ 'ఆహా' డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. పాయల్ రాజ్ పుత్ మరియు చైతన్య కృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహించారు.