తమన్నా మాట్లాడుతూ కరోనా నిర్థారణ అయిన వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అయిన సమయంలో... ఆమె తీసుకున్న ట్రీట్ మెంట్ చాలా కఠినంగా ఉండేదట. ఇక కరోనా లక్షణాలు తనలో పూర్తిగా కనిపించడంతో మరిన్ని జాగ్రత్తలు వహించాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో నేను చనిపోతానేమో.. అనే భయం కూడా కలిగింది. వైద్యులు నాలో ఆత్మ విశ్వాసం కలిగించి నన్ను మామూలు మనిషిని చేశారంటూ ఎమోషనల్ అయ్యింది తమన్నా