విజయ్ ఆంటోనీ ఇప్పుడు మెట్రో వంటి డిఫరెంట్ కథాంశంతో విజయాన్ని అందుకున్న ఆనంద్ కృష్ణన్ దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి టైటిల్ గా 'కోడియిల్ ఒరువన్' అనే పేరును ఖరారు చేసారు. అయితే దీనిని తెలుగులో 'విజయ రాఘవన్'అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై టి.డి.రాజా డి.ఆర్.సంజయ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.