ఇక ప్రస్తుతం త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో ఓ సినిమా చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం త్రివిక్రమ్, కీర్తిని సంప్రదించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇందులో నటించేందుకు కీర్తి ఒప్పుకుంటే.. మరో క్రేజీ పెయిర్ని చూసే అవకాశం సినీ ప్రేక్షకులకు లభిస్తుంది. కాగా గతంలో పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన అఙ్ఞ్యాతవాసిలో కీర్తి సురేష్ నటించారు. అయితే ఈ సినిమా భారీ పరాజయమైన విషయం తెలిసిందే.అందుకే ఈసారైనా కీర్తీ సురేష్ కి ఎన్టీఆర్ సినిమా రూపంలో ఓ హిట్ ఇవ్వాలని చేస్తున్నాడట త్రివిక్రమ్.