భారీ అంచనాలతో 2018 లో విడుదలైన షారుఖ్ ఖాన్ "జీరో" మూవీ పూర్తిగా నిరాశనే మిగిల్చింది. దాంతో కన్ఫ్యూజన్లో లో పడ్డ షారుక్ దాదాపు 20 స్క్రిప్ట్ లు విన్నా కాన్సెప్ట్ నచ్చక తిరస్కరించాడట. జీరో సినిమా తర్వాత ఆయన ఒక్క సినిమాకి సంతకం చేయకపోవడం వెనుక తన కండిషన్ ని అర్థం చేసుకోవచ్చు. అయితే 2020 లో నైనా తమ అభిమాన తార షారుక్ ఖాన్ శుభవార్త చెబుతాడేమోనని ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.