బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్ 'ఆదిపురుష్' అనే సినిమాలో నటిస్తున్నాడు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు.ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగాన్ని అందుకున్నాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో సీత పాత్ర కోసం హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమా అప్డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడా అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్ ఈ సినిమాను 2022 ఆగస్టు 11 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.ఈమేరకు పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.