'అరవింద సమేత' సినిమాలో  ఫస్ట్ టైం ఎన్టీఆర్ తో కలిసి నటించింది పూజ.ఆ సినిమా ఇచ్చిన స్వీట్ మెమోరీస్ ని గుర్తు చేసుకొని.. ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది పూజా హెగ్డే. అవేంటంటే "ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకొవడం అద్భుతం అని, అరవింద సమేత సినిమా ఎప్పటికి తనకి ప్రత్యేకం అని, ఆ సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించడం సూపర్ అంటుంది. ఎన్టీఆర్ కి నాకు ఎనేర్జి లెవల్స్ కొంచెం ఎక్కువ. దానివలన ఆన్ స్క్రీన్ లో మా జోడి కి ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేశారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు. ఆఫ్ స్క్రీన్ లోను ఈ సినిమా చాలా అనుభవాలను మిగిల్చింది. అరవింద సమేత అప్పటినుండి నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటున్నాను. అది కేవలం త్రివిక్రమ్ గారివల్లే" అంటూ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ని ఆకాశానికెత్తేస్తుంది పూజ హెగ్డే.