పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించిన రేస్టీవెన్ సన్ ఈ చిత్రంలో స్కాట్ గా నటిస్తుంటే, అతని భార్య పాత్రలో అలిసన్ డూడీ కనిపించనుందట. వీరిద్దరూ ఆర్ఆర్ఆర్ షూట్లో జాయిన్ అయినట్లుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందంటూ అభిమానులు ట్రోల్ చేస్తూ సందడి చేస్తున్నారు.