రష్మిక వండిన వంటకం పేరు కూడా 'కోలీ పుట్టు' కూర. కోడిని కోర్గిలో కోలి అంటారని రష్మిక అనగానే.. మీరు కోర్గి సామాజిక వర్గానికి చెందినవారా? మీరు పంది మాంసం ఎక్కువగా తింటారు కదా? అని అడిగారు.దీనికి రష్మిక స్పందిస్తూ.. ''అవును, పంది మాంసం మా సంప్రదాయ వంటకం. పందిని అలానే నిప్పులపై కాల్చి తింటాం. నిజానికి పంది మాంసం, వైన్‌తో మేం చాలా చేస్తాం. మేం ఇంట్లోనే వైన్ తయారు చేస్తాం.ప్రతి కోర్గి ఇంట్లో పడుకునే ముందు రెండు కప్పులు లేదా రెండు పెగ్‌ల వైన్ తాగుతారు. దీని వల్ల నిద్ర బాగా పడుతుంది. అలాగే, గుండెకు కూడా చాలా మంచిది'' అని చెప్పారు.ఇందులో భాగంగానే రష్మీకతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా పంది మాంసాన్ని తమ సాంప్రదాయ వంటకంగా భావిస్తూ.. ఎంతో ఇష్టంగా తింటారట..