రెండు రోజుల క్రితం 'అల వైకుంఠ పురములో '  చిత్రంలోని 'బొట్టబొమ్మ' వీడియో సాంగ్ 450 మిలియన్లు వ్యూస్ సాధించి రికార్డ్ కొడితే.. తాజాగా ఇదే పాట 3 మిలియన్ ప్లస్ లైక్స్ సాధించి రికార్డు సాధించినట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. అంతేకాదు.. 3 మిలియన్ ప్లస్ లైక్స్ సాధించిన వీడియో సాంగ్గా తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి స్థానాన్ని ఈ పాట అందుకున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది.ఇలా ఏదో ఒక రికార్డ్ ఈ చిత్రం సృష్టిస్తూ.. విడుదలై సంవత్సరం కావస్తున్నా.. ఇంకా వార్తల్లో నిలుస్తూనే ఉంది.మొత్తానికి మన బన్నీ ఖాతాలో మరో అరుదైన రికార్డ్ చేరిందన్న మాట.మరి ముందు ముందు ఈ సినిమాలోని పాటలు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.