ఒకరోజు ట్రిప్ గురించి ప్లీజ్ నాన్నా అంటూ నన్ను కన్విన్స్ చేస్తూ లెటర్ రాసింది. ఆ లెటర్ రాసిన విధానం నాకు ఎంతగానో నచ్చింది... వెంటనే నిహారిక స్కూల్ ట్రిప్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అన్నారు నాగబాబు. ఇంతకీ ఆ లేఖలో ఏముందంటే... ఈ ట్రిప్ కు నా స్నేహితులతో కలసి వెళ్లాలని ఉంది. మీకు నా టీచర్ల నెంబర్స్ ఇస్తాను.. స్నేహితుల నెంబర్స్ కూడా ఇస్తాను... ప్రతి రోజు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయి. సిగ్నల్ ఉన్నా లేకున్నా నేను నీకు ప్రతి రోజు కాల్ చేసి ఎక్కడ ఉన్నానో ఎలా ఉన్నానో చెప్తాను.