తెలుగు సినీ పరిశ్రమ లో కూడా తమ సత్తా చాటాలని అనుకుంటున్నారో ఏమో కానీ, టాలీవుడ్ పై మనసు పడుతున్నారు ఈ ముద్దు గుమ్మలు. అయితే ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ తెలుగు పరిశ్రమకు వచ్చేస్తుంది అన్న వార్త వైరల్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం సోనమ్ కపూర్ కూడా టాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కథ ఏంటి..?.. హీరో మరియు దర్శకులు ఎవరు..?? అన్న విషయంపై అధికారంగా ఎటువంటి ప్రకటన రాలేదు.