సినీ పరిశ్రమలోని వ్యక్తులు సోషల్ మీడియాలో ఆల్ మోస్ట్ యాక్టివ్ గానే ఉంటారు.. ఏదో ఒక కొత్త విషయంతో అభిమానులకు మరింత దగ్గర అవ్వడానికి ట్రై చేస్తుంటారు. అలాంటిది బాలీవుడ్లో యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్లో కొందరు ప్రముఖుల పై పెద్ద విధ్వంసమే జరిగింది... దాంతో మిగిలిన నటీనటులు కూడా సోషల్ మీడియా జోలికి పోకుండా దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే మెరిసి మాయం అవుతున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మార్చిన సోషల్ మీడియాలో డిపి తో మళ్లీ బాలీవుడ్లో సోషల్ మీడియా హవా మొదలైనట్లు అనిపిస్తోంది.