ఆచార్య సినిమాలో కీలక పాత్రలో చరణ్ కనిపించనున్నాడు.అయితే చరణ్ సరసన కూడా ఓ హీరోయిన్ కనిపించనుందట. చరణ్ పక్కన నటించే హీరోయిన్ అంటూ చాలా పేర్లు వినిపించాయి. మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని వార్తలు వచ్చాయి. ఆతర్వాత చరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించిన కియారా అద్వానీ నటిస్తుందని ప్రచారం జరిగింది.రకుల్ , రష్మిక ఇలా మూడు నాలుగు పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా చరణ్ సరసన కొత్త భామను తీసుకోవాలి చూస్తున్నారట దర్శకనిర్మాతలు. వచ్చే వారం హీరోయిన్ ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది.