ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 పూర్తి కాగానే ఎన్టీఆర్‌తో మూవీ సెట్స్ పైకి వెళ్ళ నుందని అప్పట్లో జోరుగా వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఇప్పుడు తాజా మ్యాటర్ ఏంటంటే.. టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్నాడని వార్తలు పలు మీడియాల్లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ చిత్రాన్ని కేజీఎఫ్‌ను నిర్మించిన హొంబళే ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మించనుందని సమాచారం. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నా దాదాపుగా ప్రభాస్ - ప్రశాంత్ కాంబో ఫిక్స్ అయిపోయిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో తారక్ అభిమానులు ప్రశాంత్ నీల్ పై గుర్రుగా ఉన్నారు.  ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్‌ల నుండి సినిమా అనగానే అప్పట్లో ఓ రేంజ్లో పండుగ చేసుకున్నారు నందమూరి అభిమానులు. అయితే ఇప్పుడు తారక్‌కు ఝలక్ ఇచ్చి ప్రభాస్‌తో సినిమా ఓకే చేయడంతో, నువ్వేమన్నా తోపు దర్శకుడివా అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ.. ఈ డైరెక్టర్‌ను ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు.సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ట్రోలింగ్ హాట్ టాపిక్ గా మారింది.