తాజాగా కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్  'వెల్కమ్ యు హోమ్' అంటూ ప్రభాస్ ని కర్ణాటకకు ఆహ్వానిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఈ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ ని ఉద్దేశిస్తూ పునీత్ పెట్టిన ఈ పోస్ట్ కన్నడిగులు అసలు నచ్చడం లేదు. ప్రభాస్ ఏమైనా కన్నడ వాడా..? వెల్కమ్ హోమ్ అని ఆహ్వానించడానికి అంటూ పునీత్ పై విరుచుకుపడుతున్నారు కన్నడ నెటిజన్లు.ఇప్పటికే కన్నడ సినీ ఫ్యాన్స్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మీద చాలా కోపంగా ఉన్నారు.