వైజాగ్ అందాల బామ చాందిని కూడా కీర్తి సురేష్ రూట్ లోనే ఓటీటీ వేదికపై దూసుకుపోతోంది. ఆమె నటించిన రెండు సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ కావడం ప్రత్యేకమైన విశేషాన్ని సంతరించుకున్నాయనే చెప్పాలి. ఈమె తొలుత నటించిన 'కలర్ ఫోటో' ఆహాలో స్ట్రీమింగ్ కాగా, తాజాగా 'బంభాట్' మూవీ అమెజాన్ ప్రైమ్ లో తెగ హడావిడి చేస్తోంది.