టెనెట్ అనేది ఊహాతీతమైన నమ్మశక్యం కాని ముప్పు నుండి మొత్తం ప్రపంచం మనుగడ కోసం పోరాడుతున్న ఒక రహస్య ఏజెంట్ కథ. కానీ ఈ కథ గతానికి ముడిపడి ఉంటుంది. పేరులేని సి.ఐ.ఎ ఏజెంట్... హీరో(జాన్ డేవిడ్ వాషింగ్టన్) SWAT సైనికుల గుర్తింపును పొందుతాడు. ఉక్రెయిన్ లోని కీవ్ లోని ఒక ఒపెరా భవంతి లో రహస్య ఆపరేషన్ లో తన తోటివారితో కలిసి పాల్గొనాల్సి వస్తుంది.