కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు.... అర్థం లేదని... అన్ని రాష్ట్రాలలో రైతులకు అన్యాయమే కనిపిస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలంటూ ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ఈ విషయం పై ప్రముఖ రాజకీయ నాయకులు రైతులకు అండగా నిలబడి వారి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీలు కూడా రైతులకు మద్దతు పలుకుతున్నారు.