తాజాగా మరో ప్రముఖ బాలీవుడ్ నటి కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఇటీవలే షూటింగ్ లకు హాజరైన హీరో వరుణ్ ధావన్, నీతు కపూర్, దర్శకుడు రాజ్ మెహతా, మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. 'వన్ - నేనొక్కడినే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది.