దీపికా విగ్రహాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం లో.... ఎగ్జిబిషన్ లో ప్రదర్శనకు పెట్టారు. ఈ విషయాన్ని గుర్తించి ఈ సొట్టబుగ్గల సుందరి అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సందడి చేస్తున్నారు. తన వివాహ రిసెప్షన్లో దీపిక ధరించిన నెక్లెస్, చీర ఆ విగ్రహంపై ఉండటం.. పైగా ఆ విగ్రహం కింద ‘బాలీవుడ్ నటి’ అని పేర్కొనడం సహా అచ్చు గుద్దినట్లుగా ఆ బొమ్మ దీపిక పోలీకలు ఉండటంతో ఇది పక్కాగా దీపిక పదుకొనె విగ్రహమేనని ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తున్నారు.