తమిళంలో చిత్ర నటించిన ‘పాండియన్ స్టోర్స్’ అనే టీవీ సిరీస్ మంచి గుర్తింపును పొందింది. ఈమె పలు సినిమాల్లోనూ నటించి అభిమానుల ఆదరణ పొందింది. కెరియర్ పరంగా అంతా సజావు గానే కొనసాగిస్తున్న చిత్ర ఈ రోజు ఉదయం చెన్నై శివారు నష్రత్ పేట్టైలోని ప్రైవేట్ హోటల్ లో ఆమె ఉరి వేసుకుని మరణించినట్లు గుర్తించారు పోలీసులు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.