సత్యదేవ్ గెటప్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తాజాగా తిమ్మరుసు టీజర్ ను పూరి జగన్నాథ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో సత్య ఆదర్శమైన భావాలతో నిండి ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించనున్నాడు... న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాటం చేసైనా సరే న్యాయాన్ని గెలిపించడం అతని నైజం అంటూ హీరో పాత్ర గురించి చెప్పుకొచ్చారు.