నిహారిక పెళ్లిలో ఆకట్టుకున్న జంటల్లో ఎవరి జోడీ ఎక్కువ మార్కులు కొట్టేసి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది? అంటే నిశ్శందేహంగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - స్నేహ జంటకే అందరి ఓటు పడిందనే చెప్పాలి. క్యూట్ లవ్ లీ పెయిర్ గా పెళ్లి వేడుక ఆద్యంతం సందడి చేసింది ఈ లవ్ లీ జోడీనే.కేవలం మెగా కుటుంబం నుంచి 10 జంటలు పైగా ఈ వేడుకకు అటెండ్ కాగా.. అందులో సంథింగ్ స్పెషల్ జంటగా అల్లు అర్జున్ - స్నేహ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.