హిందీలో అమీర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో విజయ్ సేతుపతిని ఓ కీలక పాత్రకు తీసుకున్నారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి లెక్కలు వేయకుండా... ఎక్కువ తక్కువ అని తారతమ్యాలు చూడకుండా ..క్యారెక్టర్ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇస్తారు విజయ్ సేతుపతి. అదేవిధంగా ‘లాల్..’లో పాత్ర బాగా నచ్చడంతో అందుకు ఓకే చెప్పారు.