తలైవి.. ఓ విప్లవ నాయకురాలు. ఇలాంటి పాత్రలు చేసే అవకాశం చాలా అరుదుగా వస్తుంది. అందులోనూ ఇలాంటి పాత్ర చేయడం నా అదృష్టం. ఈ పాత్ర నా మనసుకు ఎంతగానో దగ్గరయింది.. ఈ పాత్రను ఎంతో ప్రేమించి చేశాను. అందుకే సినిమా చివరి రోజు ఈ క్యారెక్టర్‌కి బై చెప్పడానికి చాలా బాధనిపించింది షూటింగ్ స్పాట్ ను వదిలి వెళ్లాలని అనిపించలేదు అన్నారు కంగనా రనౌత్.