తాజాగా ఆదివారం (డిసెంబర్ 13) వెంకీ పుట్టినరోజు సందర్భంగా ‘గ్లింప్స్ ఆఫ్ నారప్ప’ అంటూ శనివారం ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆగ్రహం నిండిన కళ్లతో, చేతిలో కత్తితో నారప్ప గెటప్ లో చేతిలో కత్తి పట్టుకొని ఓ చెట్టుచాటు నుంచి ఆవేశంగా నడుస్తూ వస్తుంటాడు. ఆ తర్వాత కత్తితో ప్రత్యర్థులను నరికి తనదైన శైలిలో ఆకాశం వైపు చూస్తూ పెద్దగా అరవడంతో ఈ టీజర్ పూర్తయ్యింది.