ఆ క్రమంలో కంగనా రనౌత్ హీరో హృతిక్ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అలా ఈ ప్రేమ వ్యవహారం లో ఇరువురి మధ్య "మెయిల్" రచ్చ మొదలైంది. కంగనా తో తనకు ఎటువంటి సంబంధం లేదని.. అయినా ఆమె జిమెయిల్ అకౌంట్ నుండి వందలకొద్దీ మెయిల్స్ వస్తున్నాయని... దీని కారణంగా తన ఇమేజ్ దెబ్బతింటుందని 2016లో పోలీసులకు ఫిర్యాదు చేశారు హృతిక్. అయితే ఆ కేసుపై ఎటువంటి పురోగతి లేదని, ఇప్పటికైనా దానిపై దృష్టి సారించాలంటూ హృతిక్ తరఫు లాయర్ మహేష్ జెఠ్మలానీ ముంబై పోలీసులకు తాజాగా లేఖ రాశారు.