తమిళ నటి చిత్ర ఆత్మహత్య ఎంత కలకలం రేపిందో తెలిసిన విషయమే. 'పాండియన్ స్టోర్’ లో ముల్లై పాత్రతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న నటి వి.జె.చిత్ర(28) ఆత్మహత్య చేసుకొని మనందరికీ దూరమయ్యారు. పాండియన్ స్టోర్స్ సీరియల్ తెలుగులో ‘వదినమ్మ’ పేరుతో డబ్ అవుతున్న విషయం విదితమే. చెన్నైలోని నజరేత్‌పేట్‌లో గల ఓ ఫైవ్ స్టార్ హోటల్లో బస చేసిన చిత్ర సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కాలం చెల్లించారు.