గతం సినిమా విమర్శకులను సైతం మెప్పిస్తూ... ఇటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో తాజా విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ సినిమా అందుకున్న విశిష్టమైన గుర్తింపు ఏంటంటే.. గతం చిత్రం ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లో ప్రదర్శనకి ఎంపికయ్యి రికార్డు సృష్టించింది.