కూలీ నంబర్ వన్ రీమేక్ లో హీరో వరుణ్ ధావన్ నటించిన విషయం తెలిసిందే.ఆ చిత్రంలోని ఓ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కదిలే ట్రైన్ పై వేగంగా పరుగెత్తుకొచ్చే హీరో వరుణ్.. ఒక్కసారిగా రైలు ముందుకు పట్టాలపై దూకి ముందున్న పాపను కాపాడుతాడు.  దీంతో ఈ సీన్ తో ఫిజిక్స్ కు కాలం చెల్లిందని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తు ఈ విషయంలో మాత్రం వరుణ్ ధావన్ మన బాలయ్య బాబునే మించిపోయాడని కామెంట్ చేస్తున్నారు..