ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా... ఎంత గొప్ప దర్శకులు తెరకెక్కించిన చిత్రాలు అయినా ... జనాలకు కంటెంట్ కనెక్ట్ కాకుంటే బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవడం తప్పదు. ఇది ఎన్నో సినిమాలతో రుజువయింది. మహామహులు ఆరంభంలో రాణించినా తరువాత చతికిలబడ్డారు.