నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి ఎందుకో సైలెంట్ అయ్యాడు.. దీన్ని నందమూరి అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. BB3 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ప్రగ్య జైస్వాల్ కథానాయిక గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు.. ఇటీవలే వచ్చిన ఈ సినిమా టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాగా షూటింగ్ చివరిదర్శలో ఉంది.. ఈ వేసవికి సినిమా ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు..