గతంలో సోషల్ మీడియాలో సింగర్ సునీత సందడి కాస్త తక్కువగానే ఉండేది. కానీ ఆమె రెండో పెళ్లి మొదలైంది మొదలు ఇక రోజుకో వార్తతో మన ముందుకు వస్తోంది. జనవరి 9న ఈమె ప్రముఖ మీడియా వ్యాపారవేత్త.. మ్యాంగో రామ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. పెళ్లికి సంబంధించిన చాలా ఫంక్షన్ లలో చాలా బిజీగా ఉన్న సునీత త్వరలో రామ్ తో కలిసి హనీమూన్ కి కూడా వెళ్లనుందని వార్తలు వినిపిస్తున్నాయి.