కరోనా కరువు కాలంలో ఆపద్బాంధవుడు గా మారి ‘రియల్ హీరో’గా నీరాజనాలు అందుకుంటున్న నటుడు సోనూ సూద్ కు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. కోర్టును ఆశ్రయించిన ఆయనకి నిరాశే మిగిలింది. బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) నోటీసులను వ్యతిరేకిస్తూ బాంబే హైకోర్టు లో పిటిషన్ వేశారు నటుడు సోనూసూద్.