శృతిహాసన్ తండ్రికి తగ్గ కూతురిగా తనకు తాను మలుచుకుంది. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా అన్నింటినీ దాటి టాప్ హీరోయిన్ గా ఎదిగారు శ్రుతి. చిన్నతనం నుండే సంగీతం నేర్చుకుని ఎన్నో ఆల్బమ్స్ కూడా చేశారు. తండ్రి సపోర్ట్ ఫుల్ గా తీసుకొనే అవకాశం ఉన్నా తనకు తానుగా స్వయంకృషితో ఇండస్ట్రీ లో నిలదొక్కుకున్నారు శ్రుతి.