బలుపు, డాన్ శీను తర్వాత క్రాక్తో గోపీచంద్ మలినేనితో రవితేజ హ్యాట్రిక్ హిట్ నమోదు చేసి వీరి కాంబినేషన్ సూపర్ హిట్ అన్న ముద్రను మరింత దృఢ పరిచి దూకుడు పెంచారు. ఇంతటి ఘన విజయం తర్వాత రవితేజ నటించబోతున్న తదుపరి చిత్రం *ఖిలాడి*. రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.