టాలీవుడ్ ఇండస్ట్రీలో మెలోడీ బ్రహ్మగా పేరు ప్రఖ్యాతులు పొంది... తన సంగీతంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. ఒకప్పుడు టాలీవుడ్ సంగీత రాజ్యాన్ని ఏలిన ఈ మ్యూజిక్ రారాజు ఈ మధ్య కాలంలో కాస్త వెనక పడ్డారు అనే చెప్పాలి. యువ సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, తమన్, అనిరుధ్, మిక్కీ జే మేయర్, అనూప్ రూబెన్స్ వంటి మ్యూజిక్ డైరెక్టర్స్ అడుగుపెట్టిన తరవాత మణిశర్మ హవా బాగా తగ్గింది.