ఓ చిత్రం హిట్ అయితే చాలు.. ఇక ఆ సినిమాని పలు భాషల్లో రీమేక్ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు పలువురు దర్శకులు మరియు నిర్మాతలు. కంటెంట్ బాగుంటే చాలు ఇక రీమేక్ రైట్స్ కోసం క్యూలు కట్టేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు మరియు తమిళ సినిమాలు హిందీలో రీమేక్ కాబోతున్నాయి. అదే విధంగా తెలుగు సినిమాలు తమిళం లోనూ రీమేక్ కు సిద్ధమవుతున్నాయి.