కరోనా నేపథ్యంలో.. లాక్ డౌన్ సమయంలో ఓటీటీల దూకుడు ఏ రేంజిలో పెరిగిందో అందరికీ తెలిసిందే. ఈ వేదికలకు కరోనా టైం బాగా కలిసొచ్చి ప్రేక్షకుల ఆదరణ లభించింది. క్రేజ్ కూడా ఊహించని విధంగా బాగా పెరిగింది. అయితే ఓటిటి లకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఓటిటి లకు సంబంధించి కొత్త నిబంధనలను పెట్టింది కేంద్రం.