విలక్షణ నటుడు రాజశేఖర్ కూతుర్లు తెలుగు సినీ ఇండస్ట్రీ లో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. రాజశేఖర్ పెద్ద అమ్మాయి శివాని... మొదట ఓ సినిమా చేస్తుండగా కొన్ని కారణాల వలన అది మధ్యలోనే ఆగిపోయింది. దాంతో మరో సినిమాలో బిజీ అయిపోయారు ఆమె. ఇంతలోనే ఆయన రెండో కూతురు శివాత్మిక.. దొరసాని సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.